Friday, July 8, 2011

'రిజర్వేషన్లు ఇచ్చింది సోనియాకాదు వైఎస్'

ఇడుపులపాయ(వైఎస్ఆర్ జిల్లా): ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాదని, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ చెప్పారు. పార్టీ ప్రజాప్రస్థాన ప్లీనరీ సమావేశాలలో మైనార్టీలకు సంబంధించిన తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ముస్టింలకు తీర్చలేనిదన్నారు. కాంగ్రెస్ వారికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎంత గొప్పో, తమకి విజయమ్మ, జగన్మోహన రెడ్డి అంత గొప్ప అన్నారు.

వైఎస్ మృతి చెందిన తరువాత ముస్లింలు ఎంతో నష్టపోయారన్నారు. ముస్లింలు అందరూ జగన్మోహన రెడ్డి వెంటే ఉంటారని తెలిపారు. తమకు కావలసింది జగనన్న ముఖ్యమంత్రి కావాలి అంతే అన్నారు. మనకి కులాలు, మతాలు వద్దు, మనది వైఎస్ఆర్ కులం అన్నారు.

Swarna yugam Jagan thone




Siggupaduthuna Ash